Saturday, September 22, 2007

కరుణానిది కి పంచె మరోసారి ఊడాలా??

తిండి ఎక్కువయి .... పని తక్కువయితే కళ్ళు నెత్తి మీదకు వస్తాయి అని పెద్దవాళ్ళు అంటూ వుంటారు .....ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రికి అదే అయినట్టు వుంది. కొన్ని కోట్ల మంది భారతీయులు మహాపురుషుడుగా భావించి అదర్శంగా తీసుకునే శ్రీరాముడి ఉనికినే ప్రశ్నిస్తున్నాడు ... ఒకసారి ఎదో తొందరలో నోరు జారాడు అనుకుని వదిలేస్తే రొజు రొజుకీ ఆయన మాటలు హిందుత్వానే ప్రశ్నిస్తున్నాయి... ఆయన ఉన్నది 70 కోట్ల మంది ఉండే హిందూ దేశంలో అని గుర్తుపెట్టుకుంటే చాలమంచిది. అధికారంలో ఉన్నప్పుడు ఒంటి బలుపుతో చేసే తప్పులకు ఆ అధికారం పోయాక పంచె ఊడేదాక కొడతారన్న సంగతి అందరికంటే ఎక్కువగా గౌరవనీయులు, ముఖ్యమంత్రివర్యులు కరుణానిది కి బాగా తెలుసు .... ఆ పరిస్థితి తెచ్చు కోవాలని ఆయనకు సరదాగా ఉన్నట్టుంది.

మొట్టమొదటిసారిగా నేను హిందువును అనే విషయం పదే పదే గుర్తుకువచ్చింది... రాముడిని, రామాయణాన్ని అవమానపరచటం అంటే భారతదేశంలోని ప్రతీ హిందువుని అవమానపరచటమే... 80 సంవత్సరాల వయసు దాటిన ఒక రాష్ట్రాదినేత కనీస విగ్నత లేకుండ మాట్లడటం చూస్తుంటే ఇది ఏదో తెలియక చేసిన వ్యాఖ్యలు అని వదిలేయలేము .... ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన రచయిత్రి తస్లిమ బేగం రాసిన నవల ముస్లింలను అవమానపరిచేలా ఉంది అని ఆమెను హైదరాబాద్ లో ముస్లిం లు కొట్టారు .... 95% క్రైస్తువులు ఉండే అమెరికా వాళ్ళు జీసెస్ మీద "డా వించి కోడ్" అనే సినిమా తీస్తే అందులో కొన్ని అభ్యంతరకరమయిన సన్నివేశాలు వున్నాయని మన దేశంలో ఆ సినిమాను చాల రాష్ట్రాలలో రిలీజ్ చెయలేదు ....కొన్ని రాష్ట్రాలలో సినిమా హాళ్ళను ద్వంశం చేసారు...అలాంటి రాష్ట్రాల లిస్ట్ లో తమిళనాడు ఒకటి ... అలాంటప్పుడు కరుణానిది తలనరికితే నజరాన అని విశ్వ హిందు పరిషత్ ప్రకటించటం లో తప్పులేదనిపిస్తుంది....

పక్కవాడి నమ్మక్కాని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు .... రాజ్యంగం ప్రకారం భావ ప్రకటనా స్వేచ్చ ప్రతి ఒక్కరికి వుంది కాని పక్కవాడి కులాన్నో, మతాన్నో, సిద్దంతాన్నో పశ్నించే హక్కు ఎవడికి లేదు ఈ విషయం మన నాయకులకు తెలీకపోవటం బాధాకరం.

కరుణానిది వయసు పైన పడి అర్దంపర్దం లేకుండా మాట్లాడుతున్నట్టు వుంది....ముందు రాముడు కల్పితం అన్నాడు తర్వాత ఆయన లేడు అని చెప్పిన రాముడు తాగుబోతు అంటున్నాడు .... చూస్తువుంటే ఈయన ఎమైనా మందుకొట్టి మాట్లడుతున్నాడా అని సందేహం వస్తుంది. అయినా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న ఈయనకి ఏకపత్నీవ్రతుడు అయిన రాముడి గొప్పతనం ఎలా తెలుస్తుంది ??? తండ్రి మాట కోసం రాజ్యాని వదిలిన రాముడి గొప్పతనం అధికారం కోసం అడ్డమయిన పనులు చేసే కరుణానిదికి ఎలా తెలుస్తుంది.

2 comments:

Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి) said...

మొన్ననే ఈ వార్త చదివి నిర్ఘాంతపోయాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అనుభవం గల రాజకీయనాయకుడు ఇలా మట్లాడడం సరి కాదు. చూస్తుంటే మీరు చెప్పిందే నిజమై కరుణానిధికి మరోసారి పంచి ఊడే సందర్భం దాపురించేటట్టే ఉంది.

vijju said...

తండ్రి మాట కోసం రాజ్యాని వదిలిన రాముడి గొప్పతనం అధికారం కోసం అడ్డమయిన పనులు చేసే కరుణానిదికి ఎలా తెలుస్తుంది.
ఇది కోంచెం మార్చి... అధికారం కోసం అడ్డమయిన పనులు చేసే రాజకీయ నాయకులకి ఎలా తెలుస్తుంది. అంటె బాగుంటుంది... అనుకుంటా