Thursday, August 9, 2007

నా బ్లాగు పరిచయం

రాజకీయం


రా - రాజ్యాంగబద్దంగా
జ - జనానికి
కీ - కీడుచెసే
యం - యంత్రాంగం


పైన చెప్పిన అర్ధం ఖచ్చితంగా నేటి రాజకీయ పరిస్థితికి సరిపోతుంది

గత కొంత కాలంగా భారత దేశంలో ముఖ్యంగా ఆంద్రప్రదెశ్ లో జరుగుతున్న రాజకీయ ఘటనలు చూస్తుంటే గాందీ గారు తెచ్చిన స్వతంత్రం అయనతో పాటే తీసుకుని వెల్లిపోయడా అని అనిపిస్తుంది.

నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా ఆంద్రప్రదెశ్ లోని ఒక గిరిజన ప్రాంతంలో. నాగరికత పుట్టిందా అన్నట్టు వుండే అమాయక ప్రజల జీవన విధానాన్ని స్వయంగా 18 సంవత్సరాలు చూసాను....ఎప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న ఆశ వుండేది ఎదో ఒక రోజు మాకు కూడ పట్నం వాళ్ళలా అన్ని సదుపాయాలు వస్తాయి అని కాని ఇప్పుడు నాకు తెలిసింది ఎప్పటికీ మా బ్రతుకులు మారవని ఎందుకంటే అభివ్రుద్ది చేయటానికి నిధులు కావాలి కాని ఆ నిధులను మన ప్రజాప్రతి ' నిధులు ' నిత్య నైవేద్యంలా మింగేస్తున్నారు........ ఈ పరిస్థితి ఎదో ఒక్క పల్లెకో, పట్నానికో, ఆంద్రప్రదెశ్ కో సంభందించినది కాదు యేవత్భారతదేశం ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థతో కుమిలిపోతుంది దీని మీద నేటి యువత అలుపెరుగని యుద్దం చేయాలి....అందుకే నేడు జరుగుతున్న అన్యాయాలను గొంతెత్తి విమర్శించే సత్తాలేని నాకు ఈ బ్లాగు ఒక రాజ మార్గం....... ఇక్కడ నేను ప్రతి నాయకుడు చెసే పిచ్చి పిచ్చి వాగ్దానాలను, వ్యాఖ్యలను ధైర్యంగా విమర్శించవచ్చు ఎందుకంటే మన నాయకులకు సంతకం పెట్టే కనీస ఙ్నానం కూడ లేదు కనుక నా ఈ బ్లాగుని చదివి నన్ను బెదిరించే అవకాశం ఎట్టి పరిస్థితిలోను వుండదు.... నా భయం ఎమిటంటే ఒకప్పుడు నాయకులు రోజు నైవేద్యం తినే పనిలొనే వుండేవాల్లు కనుక పక్క వాళ్ళు ఎమి తిట్టినా పట్టించుకొనే టైం వుండేది కాదు... కాని ఈ మద్యన మన భావి నాయకులు (అంటే దొంగనా కొడుకుల కొడుకులు ) ఎవరన్నా ఎమన్నా అంటే కొడుతున్నారు.... అందుకే ఇలా బ్లాగుల వెంట పడాల్సి వస్తుంది.

6 comments:

Unknown said...

బ్లాగు లోకానికి స్వాగతం.

మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది.

జల్లెడ

www.jalleda.com

oremuna said...

రజకీయానికి మీరిచ్చిన నిర్వచనం బాగుంది

రాధిక said...

రాజకీయాల గురించి మంచి అవగాహన వున్నట్టుంది.బాగుంది.ఆ నిర్వచనం పరుచూరి గోపాల క్రిష్ణ మాటల్లో మరింత బాగుంటుంది.

Anonymous said...

బాగు..బాగు.

-- విహారి
http://blog.vihaari.net

Anonymous said...

good

Suneel Vantaram said...

రాజకీయనికి మీరు ఇచ్చిన నిర్వచనం చాలా బాగుందండి.