Thursday, August 16, 2007

ఆంద్రప్రదేశ్ ...రాజీవ్ ప్రదేశ్....ఇందిరా ప్రదేశ్

చిన్నప్పుడు ఒక సామెత వినేవాడిని " పని లేని మంగలోడు పిల్లి తల గొరికాడు " అని అంధ్రప్రదేశ్ లో కాంగ్రేస్ వాళ్ళ పని అలానే వుంది...

రాష్ట్రంలో కుప్పలు కుప్పలు గా సమస్యలుంటే అవన్నీ వదిలేసి 40 సంవత్సరాల క్రితం పుట్టిన కూకటపల్లి హౌసింగ్ బోర్డ్ పేరును రాజీవ్ గాంధి హౌసింగ్ బోర్డ్ అని పేరు మారుస్తున్నాము అని కొత్త గొడవ పైకి తెచ్చింది ఇవ్వాల...

ఈ మద్యకాలంలో నేనే కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలుపెట్టిన రకరకాల స్కీముల పేర్లు చూసి .... దేని పేరు ఇందిరో దేని పేరు రాజీవో అర్దం కాక కనుఫ్యూజ్ అవుతున్నాను...

దేనికయినా ఒక లిమిట్ అంటూ వుంటుంది ......ఆ లిమిట్ దాటబట్టే బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టిన మనము ......అదే కాళ్ళు పట్టుకుని వాళ్ళ దేశానికి విసిరి కొట్టింది......పాలకులు చెసే ప్రతీ పని ప్రజలు చూస్తుంటారు .......కొంత వరకు తప్పులను క్షమిస్తారు... లిమిట్ దాటితే పాలకులు రోడ్డు మీద పకీర్లు కావలసిందే .....చూస్తుంటే కాంగ్రేసోల్లు పధకాలకు పేర్లు పెట్టే విషయంలో ఆ లిమిట్ ఎప్పుడో దాటేసారు .......ఇప్పటికి 23 పధకాలకు రాజీవ్, ఇందిర పేర్లు పెట్టారంట (ఈనాడు ప్రకారం)

కాంగ్రెసోల్లకు అంత అభిమానం వుంటే వాల్ల పిల్లలకో, తల్లులకో ఆ పేర్లు పెట్టుకొవచ్చు గా.....లేకపొతే వాళ్ళ కంపెనీలకు పెట్టుకొవచ్చుగా ...నేను ఏమి రాజీవ్, ఇందిరలకో లేక కాంగ్రెస్ కో వ్యతిరేకిని కాదు.... నేనూ వాళ్ళను గౌరవిస్తాను కాని వాళ్ళకంటే గొప్పవాళ్ళు చాల మంది వున్నారు.... మన రాష్ట్రంలొనే వున్నారు......ఒక అల్లూరి సీతరామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, వీరేశలింగం పంతులు, సర్వేపల్లి రాధాక్రిష్ణ, పొట్టి శ్రీరాములు ఇలా చెప్పుకుంటూ పొతే ఈ లిస్ట్ కి ఎండ్ లేదు .....కాని పాపం మన కాంగ్రేసోల్లకు మతిమరుపు వచ్చినట్టు వుంది...... వీళ్ళకు కేవలం ఇందిర, రాజీవ్ లే గురుతున్నారు......

ఇంక మన విపక్షాల కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ...... కుర్చీ కోసం నక్కల్లా ఎదురుచూస్తు ఎప్పుడు బందులు చేద్దామా .....ఎప్పుడు పేపర్ లో మొదటి పేజ్ లో ఉందామ అని ఎదురు చూస్తుంటారు......వీళ్ళు దొరికిందే సందు అని కూకటపల్లి హౌసింగ్ బోర్డ్ పేరు మారుస్తున్నందుకు ఈ రోజు షాపులు, స్కూల్లు గట్రా బంద్ చేశారు ... పేరు మార్చిన కాంగ్రేసోల్లను ఏమి అనలేక ప్రజలను ఇబ్బంది పెట్టారు... ఈ ప్రతిపక్షాలు నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకుంటే వెళ్ళి పేరు మారుస్తాను అని అన్న వాడి ఇంటిని బంద్ చేయొచ్చు గా .....అలా చేయరు......ఎందుకంటే వీళ్ళకు అంత సీన్ లేదు......ప్రజలంటే పిచోళ్ళు వీళ్ళు చెప్పినవెంటనే షాపులు మూసెస్తారు ఎందుకంటే ఏ తిక్కోడు రాళ్ళు వేస్తాడో అని..... ఎంతకాలం ఈ రాజకీయ పార్టీల డ్రామాలు చూస్తుండాలి ...... ఏడుకొండలవాడా వీళ్ళను నువ్వే మార్చాలి లేకపొతే ... తిరుమల కొండను కూడ రాజీవ్ కొండ గా మార్చెస్తారు.......జర జాగ్రత్త...

ఆంద్రప్రదేశ్ ...రాజీవ్ ప్రదేశ్....ఇందిరా ప్రదేశ్

5 comments:

spandana said...

మీరన్నట్లు చివరికి ఆంద్ర ప్రదేశ్ పేరునే ఇందిరా ప్రదేశ్‌గా మారిస్తే అడిగే దిక్కెవరు? వైస్ అంటున్నాడు చూడండి "రాజీవ్ కంటే గొప్ప నాయకుడెవ్వరు?" అని అలాగే "ఏ నాయకుడి పేరూ లేని కాలనీకేగా పేరు పెడుతున్నది" అని. ఈ రెండింటికీ "ఆంద్ర ప్రదేశ్" పేరు కుడా వర్తిస్తుంది. త్వరలో దాని పేరూ మారుస్తారు. హతవిధీ!

--ప్రసాద్
http://blog.charasala.com

రానారె said...

వినాశకాలే విపరీత బుద్ధిః!

Burri said...

బాగుంది కాని.. ఒకటి మాత్రమ్ నిజం, కాంగ్రేస్ వాళ్లు పేర్లు మాత్రమే పెట్టుకోన్నారు, తెలుగు దేశం వాళ్లు మంచి కలర్ (అయిల్) ప్రిటింగ్ పోస్టరులు (మామను త్రోకి పైకి వచ్చిన అల్లుడు పోటో) పెటినారు. ఆది ఎప్పుడు కరువుకాలంలో (నా 25 ఏళ్ల లో చూసిన కరువు). పేరు ఎప్పుడైన మార్చుకోవచు కాని అయిల్ ప్రిటింగ్ లకు పెట్టిన మనీ తిరిగి రాదు. నీవు 25 ఇందిర్మ పేర్లు మాత్రమే చూచినారు, నేను 25 పధకాల ఉపయెగం గురించి చెప్పమటున్నాను. ఈపనులు తెలుగు దేశం వాళ్లు (9 ఏళ్ల కాలం లో) చేసి ఉంటే కాంగ్రేస్ వాళ్లుకు ఛాన్స్ వచ్చేది కాదు. గుడ్డిగా ఈనాడు ఫాలో అవకూడదు. తప్పు ఒప్పులు కూడా చూడాలి. ఏమైనా తప్పులు వుంటె క్షమించగలరు.

GATLA SAYS said...

rajeev Karuvu, rajeev varadalu, rajeev current cut,rajeev 3G scam,rajeev aakramanala pathakam,

GVS Says*

ramudu r said...

chali bhagundi sir